భూగర్భ డ్రైనేజి పనులను పరిశీలించిన కార్పోరేటర్
నాచారం
మల్లాపూర్ డివిజన్ పరిధిలోని బ్రహ్మపురి కాలనీ, నాగలక్ష్మి నగర్ కాలనీ, మల్లాపూర్ ఐ డి ఏ ప్రధాన రోడ్డు లో భూగర్భ డ్రైనేజి సమస్యకు శాశ్వత పరిష్కారంగా 42 లక్షల రూపాయలతో జరుగుతున్న భూగర్భ డ్రైనేజి పనులను కార్పోరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి పరిశీలించారు.ఈ కార్యక్రమంలో హెచ్ఎం డబ్ల్యూ ఎస్ ఎస్ బి మేనేజర్ వేణుగోపాల్, దినేష్, స్థానిక నాయకులు ఫైళ్ల ప్రవీణ్, దుల్మిట్ట దయాకర్ రెడ్డి, రంగా సురేష్ గౌడ్, మెండ రఘు తదితరులు పాల్గొన్నారు.