Sahaanews.com | Latest Breaking Telugu News App

తెలంగాణ

ప్రతి విద్యార్థి పాఠశాల దశలోనే లక్ష్యంతో చదవాలి

సూర్యాపేట

కస్తూరి భా గాంధీ పాఠశాల , మోతే, సూర్యాపేట నందు బాల రక్ష భవన్ నుండి జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో పాఠశాల బాలికలకు విద్యార్థి దశలో ఆలోచన విధానం విద్యార్థి పాత్ర పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో జిల్లా బాలల పరిరక్షణ విభాగo నుండి ప్రొటక్షన్ అధికారి షేక్. మీరా మాట్లాడుతూ ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కరి విద్యార్థి ఆలోచన విధానం మార్పు రావాలని ప్రతిఒక్కరు భవిష్యత్తుపై లక్ష్యంతో చదువుకోవాలని , ప్రతి ఒక్కరు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండే విధంగా భవిష్యత్తు కార్యాచరణ చేసుకోవాలని చెప్పినారు. తల్లిదండ్రులు తమ పిల్లల మీద పెట్టుకున్న ఆశలు, నమ్మకాన్ని ,భవిష్యత్తు లక్ష్యాన్ని సాధించేందుకు పిల్లలు ఇష్టం తో కష్టపడి చదువుతూ మంచి పేరు తేవాలని అప్పుడు మాత్రమే తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యత పూర్తిస్థాయిలో నిర్వహించినట్టు అవుతుంది అని చెప్పటం జరిగింది . పాఠశాల దశలో విద్యార్థి పూర్తిస్థాయిలో అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలని, సమాజం లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు గురించి ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పినారు. కె జి. బి. వి ఎస్ ఓ ధన లక్ష్మి మాట్లాడుతూ ఈ పాఠశాల దశలో పిల్లలు తీసుకునే నిర్ణయాలే వారి జీవితానికి పునాదుల్లా ఉంటాయని తెలిపినారు . మంచి స్నేహాలు మాత్రమే చేయాలని చేడు స్నేహాలకు దూరంగా ఉండాలని మరియు పెద్దల మీద గౌరవం ఉండాలని ప్రతి ఒక్కరికి విధేయులుగా ఉండాలని చెప్పినారు. బాల రక్ష భవన్ అధికారి శ్రీలక్ష్మి గారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కూడా గ్రామస్థాయి నుండి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వారే కాబట్టి బాగా చదువులో రాణించి తల్లిదండ్రులకు, గురువులకు పేరు తీసుకు రావాలని కోరారు. విద్యార్థినులకు సేఫ్ టచ్ – అన్ సేఫ్ టచ్ గురించి, child help line toll free No. 1098 గురించి వివరించడo జరిగింది.ఈ కార్యక్రమంలో కేజీబీవీ SO ధనలక్ష్మి ఉపాధ్యాయురాలు సంధ్య దేవి, ఎల్లమ్మ, శ్రీదేవి, కోటేశ్వరి మల్లీశ్వరి మరియు బాల రక్ష భవన్ అధికారులు Sk.మీరా, V.V.శ్రీలక్ష్మి మరియు పిల్లలు పాల్గొనడం జరిగింది.

Related posts

బుగ్గారంలో బాంబుల గోదాం నిర్మాణం ఆపాలి

Sahaa News

పోలీస్ స్టేషన్ ను సీపీ ఆకస్మిక తనిఖీ

Sahaa News

బహుజనుల విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న

Sahaa News
Share via