హైడ్రా అంటే “హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్” జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు,చెరువు శిఖాలు, వక్స్ బోర్డు కు ,దేవలయాల భూములు, మున్సిపల్ పార్కులు, పేదల ఇనాం భూములు కబ్జాదారుల ఆక్రమంలో ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఈ ఆక్రమణలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇంకా చెరువులు, నాలాల భూముల కబ్జాల పాలవుతూనే ఉన్నాయి.ముఖ్యంగా నాలాల ,చెరువుల ఆక్రమణ వలన హైదరాబాద్ లో చిన్న పాటి వర్షానికి ఎక్కడ నీరు అక్కడే నిలిచి ముంపు ప్రాంతాలు రోజు రోజు కీ పెరిగిపోతున్నాయి.ఈ నేపథ్యంలో కబ్జాదారుల బారి నుంచి నాలలకు విముక్తి కల్పించడంతోపాటు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు TG సర్కారు హైడ్రాను రంగంలోకి దించింది.