Sahaanews.com | Latest Breaking Telugu News App

తెలంగాణ

ఆడపిల్ల చదువు దేశ ఉజ్జ్వల భవిష్యత్తు కు పునాది

సూర్యాపేట :ఆగస్టు 24 (సహా న్యూస్): కస్తూరిభా గాంధీ పాఠశాల , మునగాల సూర్యాపేట నందు బాల రక్ష భవన్ నుండి జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో పాఠశాల బాలికలకు విద్యార్థి దశలో ఆలోచన విధానం విద్యార్థి పాత్ర పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగo ప్రొటక్షన్ అధికారి షేక్. మీరా పాల్గొని మాట్లాడుతూ సమాజంలో ప్రతి విద్యార్థి ఆలోచన విధానంలో మార్పు రావాలని ప్రతిఒక్కరు భవిష్యత్తుపై ఉన్నత లక్ష్యంతో చదువుకోవాలని , ప్రతి ఒక్కరు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండే విధంగా భవిష్యత్తు కార్యాచరణ చేసుకోవాలని అన్నారు.తల్లిదండ్రులు తమ పిల్లల మీద పెట్టుకున్న ఆశలు, నమ్మకాన్ని ,భవిష్యత్తు లక్ష్యాన్ని సాధించేందుకు పిల్లలు ఇష్టం తో కష్టపడి చదువుతూ మంచి పేరు తేవాలని అప్పుడు మాత్రమే తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యత పూర్తిస్థాయిలో నిర్వహించినట్టు అవుతుంది అని తెలిపారు. పాఠశాల దశలో విద్యార్థి పూర్తిస్థాయిలో అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలని, సమాజం లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు గురించి ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. కె జి. బి. వి ఎస్ ఓ సునీత రాణి మాట్లాడుతూ ఈ పాఠశాల దశలో పిల్లలు తీసుకునే నిర్ణయాలే వారి జీవితానికి పునాదుల్లా ఉంటాయని తెలిపినారు . మంచి స్నేహాలు మాత్రమే చేయాలని చేడు స్నేహాలకు దూరంగా ఉండాలని మరియు పెద్దల మీద గౌరవం ఉండాలని ప్రతి ఒక్కరికి విధేయులుగా ఉండాలని చెప్పినారు. బాల రక్ష భవన్ అధికారి శ్రీలక్ష్మి గారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కూడా గ్రామస్థాయి నుండి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వారే కాబట్టి బాగా చదువులో రాణించి తల్లిదండ్రులకు, గురువులకు పేరు తీసుకు రావాలని కోరారు. విద్యార్థినులకు సేఫ్ టచ్ – అన్ సేఫ్ టచ్ గురించి, child help line toll free No. 1098, 100 గురించి వివరించడo జరిగింది.ఈ కార్యక్రమంలో కేజీబీవీ SO సునీత రాణి ఉపాధ్యాయురాలు జ్యోతి,స్వాతి,విజయ నిర్మల,రేణుకా,టేస్లైంబేగం,రజిత,కవిత మరియు బాల రక్ష భవన్ అధికారులు Sk.మీరా, V.V.శ్రీలక్ష్మి మరియు పిల్లలు పాల్గొనడం జరిగింది.

Related posts

మీర్పేట్ హెచ్ బీ కాలనీ డివిజన్ లో ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పర్యటన

Sahaa News

మినీ ధియేటర్ నీ ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే

Sahaa News

ఘనంగా వైయస్సార్ జయంతి వేడుకలు

Sahaa News
Share via