Sahaanews.com | Latest Breaking Telugu News App

తెలంగాణ

పూలే విగ్రహ విధ్వంసాన్ని ప్రజాపాలనపై దాడిగా భావిస్తున్నాం

ఓరుగల్లులో ఫూలే విగ్రహా విధ్వంసంపై మండిపడ్డ బీసీ రాజ్యాధికార సమితి.

మహనీయుల విగ్రహాల పరిరక్షణకు ఆర్డినెన్స్ ను, ప్రత్యేక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలి.

దాసు సురేశ్ , అధ్యక్షులు-
బీసీ రాజ్యాధికార సమితి

వరంగల్: అక్టోబర్ 14( సహా న్యూస్)

వరుసగా కొనసాగుతున్న మహనీయుల విగ్రహాల విధ్వంసాన్ని నిరసిస్తూ బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంజాల రాజేందర్ నేతృత్వంలో బీసీ రాజ్యాధికార సమితి నాయకులు బీసీ, ప్రజాసంఘాలతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. దుండగులను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ముక్త ఖంఠంతో నినదించారు..

ఈ కార్యక్రమానికి విచ్చేసిన బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ మాట్లాడుతూ వరంగల్ లో మహనీయుల విగ్రహాల విధ్వంసం పరిపాటిగా మారిందని మండిపడ్డారు.. గతంలో ఇదే ప్రాంతానికి చెందిన ఉర్సు ప్రాంతంలో విగ్రహ ధ్వంసానికి పాల్పడగా ఈ అంశాన్నిక్ రాష్ట్ర వ్యాప్తంగా హోరెత్తించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసారు ..ధ్వంసమైన విగ్రహ స్థానంలో పోలీసులు కొత్త విగ్రహాన్ని పునః నిర్మించగా జ్యోతిబాపూలే విగ్రహానికి దాసు సురేశ్ పూలమాలవేసి ఘనంగా నివాళ్లు అర్పించి దుండగులను శిక్షించాల్సిందిగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు..

తదనంతరం దాసు సురేశ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పాలన జ్యోతిబా ఫూలే భవనం నుండే కొనసాగుతుందనీ కావున ఈ విధ్వంసాన్ని ప్రజాపాలనపై దాడిగా భావిస్తున్నామన్నారు. దుండగులను 24 గంటల్లో అరెస్టు చేసి వారిని శిక్షించాలన్నారు ., దుండగులను శిక్షించాలని, ఇటువంటి దుశ్చర్యలు మరలా పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. రాష్ట్ర ప్రభుత్వం మహనీయుల విగ్రహాల విధ్వంసం జరగకుండా వెంటనేక్ ఒక ఆర్డినెన్స్ తీసుకురావాలని దాసు సురేశ్ డిమాండ్ చేసారు. మహనీయుల విగ్రహాల పరిరక్షణకై రాష్ట్ర స్థాయిలో ఒక పటిష్టమైన కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

రాష్ట్రంలో కులగణనను బీసీలకు మాత్రమే పరిమితం చేయకుండా అన్ని వర్గాలతో కూడిన సమగ్ర కులగణన జరిగినప్పుడే రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ నెరవేరుతుందనీ సంపూర్ణ “సామాజిక ఎక్స్ రే” అప్పుడే సాధ్యమవుతుందని దాసు సురేశ్ తెలిపారు.. సమగ్ర కులగనణ నిర్వహణకు ప్రస్తుత జిఓ ను వెంటనే సవరించాలన్నారు..మహాత్మ జ్యోతిబా ఫూలే స్ఫూర్తితో EWS రిజర్వేషన్లతో బీసీ ఎస్సీ ఎస్టీ లకు జరుగుతున్న అన్యాయాన్ని నివారించడానికి త్వరలోనే రాష్ట్ర స్థాయి ఉద్యమాన్ని బలోపేతం చేస్తామన్నారు..

ఈ కార్యక్రమానికి అఖిలభారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి, మాజీ కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ , మాజీ వరంగల్ జిల్లా పరిషత్ చైర్మన్ సాంబారి సమ్మారావు, బిజెపి వరంగల్ ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి కుసుమ సతీష్, బీసీ నాయకులు ఆడెపు రవీందర్ ,వడ్నాల నరేందర్ , జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లాఅధ్యక్షులు బుట్టి శ్యామ్ యాదవ్, బీసీ రాజ్యాధికార సమితి హనుమకొండ జిల్లా అధ్యక్షులు గాజు యుగేందర్ యాదవ్ ,వరంగల్ జిల్లా ఇంచార్జ్ వడ్డెమనుకోట తిరుపతి , మహబూబాబాద్ జిల్లా ఇన్చార్జి గండి వీరేందర్ గౌడ్, నర్సంపేట నియోజకవర్గా కన్వీనర్ కొండ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు..

Related posts

ఆదర్శ పాఠశాల కళాశాల లో విద్య ప్రాముఖ్యత పై అవగహన కార్యక్రమం 

Sahaa News

జపాన్ లో సునామీ రాబోతోందా

Sahaa News

బీసీల రాజకీయ చైతన్యంతో మారిన పార్లమెంటు ఎన్నికల ఫలితాలు..

Sahaa News
Share via