కామారెడ్డి: డిసెంబర్ 26 (సహా న్యూస్)
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం, అడ్లూర్‌లో ఎల్లారెడ్డి పెద్ద చెరువులో దూకి మహిళా కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఆత్మహత్యకు పాల్పడ్డారు.వీరితో పాటు SI సాయి కుమార్ కూడా ఉన్నట్లు సమాచారం.ఆత్మహత్య చేసుకున్న మహిళ కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలను చెరువులో నుండి వెలికితీషారు గజ ఈతగాళ్లు.ఎస్సై సాయికుమార్ ఆచూకీ మాత్రం ఇంత వరకు లభించలేదు.చెరువు కట్ట వద్ద మాత్రం SI సాయి కుమార్ పర్సనల్ కారు, పాదరక్షలు, నిఖిల్ పాదరక్షలు లభ్యం అయ్యాయి.ఘటనా స్థలంలో శృతి, నిఖిల్ మొబైల్ ఫోన్లు మాత్రమే ఉండి సాయి కుమార్ ఫోన్ లేకపోవడం స్విచ్చాఫ్ వస్తుండటంతో ఎక్కడికైనా పరారయ్యారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.